జెన్-జెడ్ : సోలో ట్రావెల్ మస్తు ఫ్రీడమ్ : తెలియనివాళ్లతో గ్రూప్ ట్రిప్స్.. మిలీయనర్స్ కూడా ఇష్టపడుతున్నారు..!

 జెన్-జెడ్ : సోలో ట్రావెల్ మస్తు ఫ్రీడమ్ : తెలియనివాళ్లతో గ్రూప్ ట్రిప్స్.. మిలీయనర్స్ కూడా ఇష్టపడుతున్నారు..!

ప్రయాణం చేయడం కేవలం అందమైన ప్రదేశాలను చూడటానికి మాత్రమే కాదు. అనుభవాలను పోగుచేసకోవడానికి, కొత్త సంబంధాలు పెంచుకోవడానికి కూడా అంటోంది ఈ తరం. అందుకోసం తెలియని వ్యక్తులతో ప్రయాణం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఈ కొత్త ట్రెండ్​ను మిలెనియల్స్ కూడా ఇష్టపడుతున్నారు. 

గతంలో గ్రూప్ టూర్లు అంటే వృద్ధులు లేదా తీర్థయాత్రలకు వెళ్లేవారితో మాత్రమే అనుబంధం ఉండేది. కానీ ఇప్పుడు మిలెనియల్స్ (1981 –-1996 మధ్య పుట్టినవాళ్లు), జెన్ – జెడ్ (1997 తర్వాత పుట్టినవాళ్లు) వారు ఈ ట్రెండ్‌‌‌‌‌‌‌‌ను మార్చేశారు. వీళ్లు తెలియని వ్యక్తులతో కలిసి గ్రూప్ ట్రిప్‌‌‌‌‌‌‌‌లకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సరికొత్త ట్రెండ్​ వెనక కారణాలు ఏంటి? 

ఒంటరితనాన్ని దూరం చేసుకోవడం కోసం..

పాండమిక్ తర్వాత చాలామంది యువత ఒంటరితనంతో బాధపడుతున్నారు. సోషల్ మీడియా, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ లైఫ్ వల్ల రియల్ లైఫ్‌‌‌‌‌‌‌‌లో ఫ్రెండ్​షిప్​లు తగ్గాయి. అందుకే వీళ్లు ట్రావెల్ టూర్ల ద్వారా కొత్త మనుషులతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. గ్రూప్ టూర్లు, క్యూరేటెడ్ గ్రూప్ ట్రిప్పుల్లో వాళ్లు లైక్ -మైండెడ్ పీపుల్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడుతూ స్నేహం పెంచుకుంటారు. ఇది సోలో ట్రావెల్ కంటే సేఫ్‌‌‌‌‌‌‌‌గా, సోషల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.

ప్లానింగ్ టెన్షన్ లేదు

సోలో ట్రావెల్ చేస్తే టికెట్లు, హోటల్స్, ఈటినరీ, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ అన్నీ తామే ప్లాన్ చేయాలి. కానీ గ్రూప్ టూర్లలో ట్రావెల్ కంపెనీలే అన్నీ హ్యాండిల్ చేస్తాయి. యువత బిజీ జాబ్స్, వర్క్ లైఫ్‌‌‌‌‌‌‌‌లో టైమ్ లేకపోవడం వల్ల ఇలాంటి రెడీమేడ్ ట్రిప్‌‌‌‌‌‌‌‌లు ఇష్టపడుతున్నారు. వియత్నాం, పెరూ లాంటి ఎగ్జాటిక్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లకు సులభంగా వెళ్లవచ్చు.

చార్జీలు షేర్ చేసుకుంటూ..

గ్రూప్ ట్రిప్‌‌‌‌‌‌‌‌లలో హోటల్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్, గైడ్ ఫీజు అన్నీ షేర్ చేసుకుంటారు. కాబట్టి ఖర్చు తగ్గుతుంది. మిలెనియల్స్, జెన్ – జెడ్ వారు బడ్జెట్​లోనే ఎక్కువ అనుభవాలు పొందాలనుకుంటారు. ఇది వీరికి పర్ఫెక్ట్ ఆప్షన్.

ఒకే ఇంట్రెస్ట్​లు ఉన్నవాళ్లు తోడవుతారు

ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్-లెడ్ టూర్లు, వెల్‌‌‌‌‌‌‌‌నెస్, అడ్వెంచర్, ఫొటోగ్రఫీ వంటి థీమ్ బేస్డ్ ట్రిప్‌‌‌‌‌‌‌‌లు ఇప్పుడు ట్రెండ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఇక్కడ ఒకే ఇంట్రెస్ట్ ఉన్నవారు కలుస్తారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి గ్రూప్‌‌‌‌‌‌‌‌లు సులభంగా కనుక్కోవచ్చు. 

స్వేచ్ఛతో కలిసిన సేఫ్టీ

సోలో ట్రావెల్ ఫ్రీడమ్ ఇస్తుంది. కానీ సేఫ్టీ, సపోర్ట్ లేకపోవచ్చు. గ్రూప్ టూర్లలో సోలో ట్రావెలర్లు కూడా జాయిన్ అవుతారు. అంటే ‘సోలో బట్ నాట్ అలోన్’. ఇది యూత్​కు ఇష్టమైన కాంబినేషన్.
ఈ ట్రెండ్ 2024- – 2025లో మరింత పెరిగింది. అమెరికన్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్, స్కైస్కానర్ లాంటి రిపోర్టుల ప్రకారం జెన్ – జెడ్, మిలెనియల్స్ ఎక్కువగా ఇలాంటి గ్రూప్ అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌లకు అట్రాక్ట్​ అవుతున్నారు. ప్రయాణం ఇప్పుడు కేవలం డెస్టినేషన్ మాత్రమే కాదు. అది సెల్ఫ్- డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కూడా అని భావిస్తున్నారు.